GST కొత్త రేట్లు వచ్చేశాయి – ఎవరికి లాభం? ఏమి చవక అవుతోంది?
దేశ ప్రజలకు దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం కొత్త Next-Gen GST Reforms ను ప్రకటించింది. ఈ మార్పులు రైతుల నుండి సాధారణ గృహాలకు, విద్యార్థుల నుండి వ్యాపారులకు అందరికీ ప్రయోజనకరంగా ఉండబోతున్నాయి.
🛒 రోజువారీ అవసరాలపై భారీ తగ్గింపు
ఇకపై మీ రోజువారీ షాపింగ్ ఖర్చులు గణనీయంగా తగ్గబోతున్నాయి.
-
Hair ఆయిల్, షాంపూ, టూత్‌పేస్ట్, సబ్బులు – 18% → 5%
-
వెన్న, నెయ్యి, పన్నీర్ – 12% → 5%
-
Napkins for babies , భుజియా & మిక్స్చర్లు – 12% → 5%
-
వంట పాత్రలు (Utensils) – 12% → 5%
-
ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్, డైపర్స్ – 12% → 5%
-
కుట్టు మిషన్ & పార్ట్స్ – 12% → 5%
🚜 రైతులకు ఊరట
వ్యవసాయ రంగంలో కూడా పన్నులు తగ్గించారు:
-
ట్రాక్టర్ టైర్లు, భాగాలు – 18% → 5%
-
ట్రాక్టర్లు – 12% → 5%
-
డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ & స్ప్రింక్లర్స్ – 12% → 5%
-
వ్యవసాయ యంత్రాలు – 12% → 5%
🏥 ఆరోగ్య రంగం
-
హెల్త్ & లైఫ్ ఇన్సూరెన్స్ – 18% → 0%
-
థర్మామీటర్ – 12% → 0%
-
మెడికల్ ఆక్సిజన్ – 12% → 5%
-
డయాగ్నస్టిక్ కిట్స్ – 12% → 5%
-
గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్స్ – 12% → 5%
-
కళ్లద్దాలు – 12% → 5%
🎓 విద్యార్థులకు గుడ్ న్యూస్
-
మ్యాప్స్, గ్లోబ్స్ – 12% → 0%
-
పెన్సిల్స్, షార్పెనర్స్, క్రయాన్స్ – 12% → 0%
-
నోట్బుక్స్ – 12% → 0%
-
రబ్బర్లు – 12% → 0%
🚗 వాహనాలపై తగ్గింపు
-
పెట్రోల్/డీజిల్ హైబ్రిడ్ కార్లు – 28% → 18%
-
LPG/CNG కార్లు – 28% → 18%
-
3 వీలర్ వాహనాలు – 28% → 18%
-
350cc లోపు బైక్‌లు – 28% → 18%
-
సరుకు రవాణా వాహనాలు – 28% → 18%
📺 ఎలక్ట్రానిక్ వస్తువులపై తగ్గింపు
-
ఎయిర్ కండీషనర్లు – 28% → 18%
-
TVలు (32 అంగుళాల పైగా) – 28% → 18%
-
మానిటర్లు, ప్రొజెక్టర్లు – 28% → 18%
-
డిష్ వాషింగ్ మెషిన్లు – 28% → 18%
✅ ఈ మార్పులు ఎందుకు ముఖ్యమంటే?
-
సాధారణ కుటుంబాలకు రోజువారీ ఖర్చులు తగ్గుతాయి.
-
రైతులు తక్కువ ఖర్చుతో యంత్రాలు కొనుగోలు చేయగలరు.
-
హెల్త్ సెక్టార్ లో చికిత్సలు చవక అవుతాయి.
-
విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ ఉచితం/చవకగా లభిస్తుంది.
-
MSMEs మరియు వ్యాపారాలకు మరిన్ని అవకాశాలు పెరుగుతాయి.
🗣️ ప్రధాని మోదీ గారు ఇలా అన్నారు:
"Next-Gen GST Reforms ప్రజలకు దీపావళి కానుక. ప్రతి ఒక్కరి రోజువారీ ఖర్చులు తగ్గిపోతాయి, ఇది ఆర్థికవ్యవస్థకు కొత్త ఊపు ఇస్తుంది."
Comments
Post a Comment